చెవిరెడ్డికి నాని శుభాకాంక్షలు.. ప్రజలకు మేలు చేయాలని సూచన - పులివర్తి నాని
చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైకాపా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నారు.
Nani
చంద్రగిరిలో పార్టీ ఓటమిపై.. చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని స్పందించారు. తమను ఆదరించిన కార్యకర్తలు, ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అభినందించారు. తెదేపా నాయకులను ఇబ్బంది పెట్టొద్దని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని చెప్పారు.