రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా పెనుకొండలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్ పర్సన్ సవిత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రభుత్వం 10 వేల రూపాయలు తక్షణ సాయం అందించాలన్నారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. స్థానిక తెదేపా నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు.