ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యేకు ఈసీ షాక్

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రజలకు చీరలు, బట్టలు పంపిణీ చేసినందుకు ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

kethireddy pedda reddy
కేతిరెడ్డి పెద్దారెడ్డి

By

Published : Mar 14, 2020, 8:50 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల 15న ఒక రోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రమేశ్​కుమార్ శుక్రవారం ఆదేశించారు. ఈ నెల 8న తాడిపత్రి పురపాలక సంఘ పరిధిలో శ్రీరాములపేటలో చీరలు, బట్టలు పంచినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయించి నిర్ధారించుకున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించి ఎన్నికల నిబంధనల కింద ప్రాసిక్యూషన్ చేస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details