ఎండ వేడికి... కారులో మంటలు - గార్లదిన్నె
ఎండవేడికి ఓ కారులో మంటలు అంటుకున్నాయి. డ్రైవరు అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ మధ్య తెలంగాణలోని వరంగల్లో ఎండ వేడికి ఓ బైకు తగలబడిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అనంతపురం జిల్లాలో మండుతున్న ఎండలకు ఓ కారులో మంటలు అంటుకున్నాయి. గార్లదిన్నె సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎండ వేడికి కారు ఇంజిన్ వేడెక్కడం.. మంటలు అంటుకోవడం గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమవడం.. పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. మంటలు వ్యాపిస్తున్న తరుణంలో కారును వెంటనే నిలిపి.. డోరు తెరిచి.. అందులో ఉన్నవారిని కిందకు దించేశాడు. స్థానికుల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చాడు.