ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం - farmer suicide

చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాలగొంది గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

By

Published : Sep 25, 2019, 10:14 AM IST

అప్పుల బాధ, అనారోగ్యం కారణంగా ఓ అన్నదాత తనువు చాలించాడు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాలగొంది గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గుడాలగొంది గ్రామానికి చెందిన ప్రసాద్​రెడ్డి... వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించే వారు. పెట్టుబడి కోసం అప్పులు చేశాడు.

వరుసగా పంటలు చేతికి అందకపోవడం కారణంగా... చేసిన అప్పులు వడ్డీతో కలిపి భారంగా మారాయి. మరోవైపు అనారోగ్యం ప్రసాద్​రెడ్డిని కుంగదీసింది. ఏం చేయాలో పాలుపోక మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రసాద్ రెడ్డి చేసిన అప్పులు సుమారు 10లక్షల వరకు ఉన్నట్లు ఆయన బంధువులు తెలిపారు.

అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

ABOUT THE AUTHOR

...view details