జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూణేలో 7వ బ్లాక్ ఖోఖో జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలను మహారాష్ట్ర ఖోఖో సమాఖ్య నిర్వహించింది. అండర్ - 20 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న ఏపీ జట్టు ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహారాష్ట్ర జట్టుపై 13 పాయింట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు ఈ టోర్నీలో ఐదు రాష్ట్రాల జట్లతో ఏపీ జట్టు వరుస విజయాలను పొందింది. ఈ జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉండగా వారిలో 9 మంది ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామానికి చెందిన వారే. మిగతావారిలో ఒకరిది చిత్తూరు జిల్లా కాగా.. మరో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉన్నారు. ఈ టోర్నీ ఉత్తమ ఆటగాడిగా ఆమిద్యాలకు చెందిన రవి అవార్డు అందుకున్నాడు.
జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం
మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. అండర్-20 విభాగంలో జరిగిన ఈ పోటీలు.. ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో మహారాష్ట్ర జట్టుపై 13 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఘన విజయం