ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో.. 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం - corona cases at ananthapur district

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డును కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించారు. దాతల సహకారంతో ఈ వార్డును ఏర్పాటు చేశామన్నారు.

corona ward at dharmavaram
corona ward at dharmavaram

By

Published : May 29, 2021, 3:18 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డును కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని కలెకర్ట్​ అన్నారు.

వార్డును కలెక్టర్ పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details