ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయవద్దు' - తాగునీటిపై అనంతపురం కలెక్టర్ చంద్రుడు సమీక్ష వార్తలు

జిల్లాలోని ప్రతి గ్రామానికి వేసవిలో తాగునీరు సక్రమంగా అందివ్వాలని.. అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని చెప్పారు.

ananthapur district collector chandrudu review meeting on drinking water in summer
వేసవిలో తాగునీటి ప్రణాళికపై అధికారులతో కలెక్టర్ చంద్రుడు సమీక్ష

By

Published : Apr 19, 2020, 3:10 PM IST

వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ చంద్రుడు అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. కొన్నిచోట్ల నీరున్నా మోటార్లు లేకపోవడం, మరమ్మతులు చేయకపోవడం, పైప్‌లైన్లు పగిలిపోయిన కారణంగా.. గ్రామాల్లో తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉందన్నారు. లాక్‌డౌన్‌ అమలుతో కొన్ని సమస్యలు ఉన్నా శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనీ.. ఒకవేళ కుదరకపోతే ట్యాంకర్లతో నీరు అందించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌.. 275 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని కలెక్టరుకు వివరించారు. సీఈవో శోభాస్వరూపరాణి, డీపీవో రామనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details