ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 28, 2020, 10:30 PM IST

ETV Bharat / state

' కోవిడ్​ను ఎదుర్కొవడంలో జిల్లా మొదటిస్థానంలో ఉంది'

కోవిడ్​ను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పాటు మెరుగైన వైద్యం అందిండంలో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.

anantapur collector conference on covid
కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం జిల్లాలో కరోనా పెరుగుదలపై కలెక్టర్ గంధం చంద్రుడు సమావేశం నిర్వ హించారు. కోవిడ్​ను ఎదుర్కొవడంలో జిల్లా మొదటిస్థానంలో ఉందని అన్నారు. ప్రతివారం ఇందుకు సంబంధించి ర్యాంకింగులు కేటాయిస్తారని.. వీటిలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. అత్యధిక మంది కోవిడ్ నుంచి కోలుకోవడం, తక్కువ యాక్టివ్ కేసులు ఉండటంతో పాటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో ముందున్నామని చెప్పారు. వైద్యులు, జిల్లా యంత్రాంగం అందరి సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.

కరోనా మొదటి రోజుల్లో కనీసం ఒక్క టెస్టు చేసే సామర్థ్యం కూడా ఉండేది కాదని ఇప్పుడు మాత్రం ఇప్పుడు నెలకు లక్షా 40వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. టెస్టింగ్ సామర్థ్యం పెంచడం, పాజిటివ్ కాంటాక్టులను త్వరగా గుర్తించడం వంటి వాటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు 56 వేల 148 పాజిటివ్ కేసులు రాగా... 54 వేల 403 మంది డిశ్చార్జి అయ్యారని.. ప్రస్తుతం 2237 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో ఉన్న సామర్థ్యంలో కేవలం 20శాతం మాత్రమే వినియోగించే అవసరం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details