మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై కక్షతోనే ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలిస్తోందని అఖిలపక్షం నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 13 జిల్లాల జలకు అనుకూలంగా ఉంటుందని గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని అన్నారు. ఇప్పుడు విశాఖకు మార్చితే రాయలసీమకు అన్యాయం జరిగినట్లేనని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని అన్నారు. రాజధానిని అమరావతిలో కొనసాగించేలా.. ఉద్యమించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
'గత ప్రభుత్వంపై కక్షతోనే రాజధానిని మార్చారు'
రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని అఖిలపక్షం నేతలు అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందని ఆరోపించారు.
'అమరావతి రాజధాని విషయంలో.. అఖిలపక్ష నేతలు ఏకాభిప్రాయం'