విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన నగర వాసులు, పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంది. 3 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శన విశాఖ వాసులకు తీయని అనుభూతిని మిగిల్చింది. రంగురంగుల పూల బంతులతో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలు రారమ్మంటూ పర్యటకులను ఆహ్వానించాయి. థాయ్‌లాండ్, సింగపూర్ సహా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన 60 వేల రకాల పుష్పాలతో ఆకర్షణీయమైన ఆకృతులను రూపొందించారు. వానరం, స్పైడర్‌మాన్, జింక వంటి పలు రకాల ఆకారాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కు మొత్తం విద్యుత్ ధగధగలతో మెరిసిపోయింది. వేడుకలను తిలకించేందుకు వచ్చిన నగర వాసులతో కిక్కిరిసిపోయింది. పార్కు అందాలను తమ చరవాణుల్లో బంధించేందుకు నగరవాసులు ఆసక్తికనబర్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
ఇదీ చదవండి: