తెలంగాణలోని పట్టణ ప్రగతిలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోడ్‌లోని హనుమాన్‌నగర్‌లో జేసీబీతో మురికి కాలువలు శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సి అనే చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా.. పాప తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. బాబును ఎంజీఎం ఆస్పపతి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్తగా జేసీబీ నడపడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతరాలి తండ్రి సాంబశివరావు వండ్రంగి పని చేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ: చిన్నారి ప్రాణాలు తీసిన 'పట్టణ ప్రగతి' - warangal latest new
తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం పసి ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోడ్‌లోని హనుమాన్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా జేసీబీతో మురికి కాలువలు శుభ్రం చేస్తుండగా పక్కన ఉన్న గోడ మీద పడి చిన్నారి మృతి చెందింది.
పట్టణ ప్రగతిలో గోడ కూలి చిన్నారి మృతి