అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం వంతెనపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రాజేష్ అనే వ్యక్తి స్వగ్రామం కొర్రకోడుకు వెళ్తున్న సమయంలో జల్లిపల్లి నుంచి ఉరవకొండకు వస్తున్న మరొక ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెన్నహోబిలం వంతెనపై ఢీకొన్న ద్విచక్రవాహనాలు - ఉరవకొండ ఆసుపత్రి
అనంతపురం జిల్లా పెన్నహోబిలం వంతెనపై ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. చోదకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.
పెన్నహోబిలం వంతెనపై ఢీకొన్న ద్విచక్రవాహనాలు