అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామంలో నీటి గుంటలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామ శివారులో రైతు పండ్ల తోటల పెంపకం కోసం సంపు సిద్ధం చేసి అందులోకి నీరు వదిలారు. గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు సంపులో నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు రమేష్‌కు భార్య, ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
నీటి గుంటలో పడి యువకుడు మృతి
తాగునీటి కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామంలో జరిగింది.
నీటి గుంటలో పడి యువకుడు మృతి
Last Updated : Nov 14, 2020, 5:57 AM IST