ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్​తో రెచ్చిపోయిన దొంగ - ismart shankar

పోలీసుల ఎదుట ఇస్మార్ట్ శంకర్ సినిమా డైలాగులు చెబుతూ ఓ దొంగ కాసేపు హల్​చల్​ చేశాడు. కిటీకి అద్దాన్ని పగులగొట్టి గాజు ముక్కలతో ఒంటిపై పొడుచుకున్నాడు. అసభ్య పదజాలంతో పోలీసులకు చిరాకు పుట్టించాడు.

దొంగ హల్​చల్

By

Published : Sep 30, 2019, 9:23 PM IST

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్​తో రెచ్చిపోయిన దొంగ

అనంతపురంలో సెల్​ఫోన్ దొంగలు హల్​చల్ సృష్టించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రివేళ ప్రయాణికుల ఫోన్లను దొంగలిస్తుండగా అక్కడివారు గమనించి ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. పట్టణ పోలీసులు వచ్చేంతవరకు ఔట్ పోస్ట్ సిబ్బంది వీరిని అక్కడే కొంతసేపు స్టేషన్​లో ఉంచారు. మద్యం మత్తులో ఉన్న ఓ దొంగ కాసేపు భీభత్సం సృష్టించాడు. "చంపుతారా? మీరు ఏమీ చేయలేరు, అమ్మా పోచమ్మ తల్లి, క్యా బోల్​ తీ" అంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమా డైలాగులు చెప్పాడు. ఔట్ పోస్ట్ స్టేషన్​లోని ఫ్యాన్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశాడు. పక్కనే ఉన్న కిటీకీ అద్దాన్ని పగలగొట్టి గాజు ముక్కలతో ఇష్టానుసారంగా ఒంటిపైన పొడుచుకున్నాడు. మూడో పట్టణ పోలీసులు అర్ధరాత్రి వేళ అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వీరు కర్నూలు జిల్లాకు చెందిన దొంగలముఠాగా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు మూడో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details