అనంతపురంలోని కళ్యాణ దుర్గం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన సమయంలో ఉన్నఫలంగా ఏటీఎంలో మంటలు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో ఏటీఎంలో నగదు లేనట్లు అధికారులు తెలిపారు. మిషన్ మాత్రమే మరమ్మతుకు గురైనట్లు చెప్పారు.
ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో అగ్ని ప్రమాదం.. - latest news in anantapur district
అనంతపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నగదు కోసం వెళ్లిన ఓ యువకుడు భయాందోళనకు గురయ్యాడు.
ఎటీఎంలో అగ్ని ప్రమాదం