అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ సిబ్బంది.. సమీప గ్రామాలైన కురుబవాండ్లపల్లి, హరిపురం గ్రామాల పరిధిలో నివాసం ఉంటున్నారు. కరోనా భయంతో కురుబవాండ్లపల్లి ప్రధాన రహదారిలో పెద్ద వంక వంతెనపై గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా ముళ్ల కంపలతో ప్రధాన రహదారి మూసివేశారు. గ్రామ సమీపంలో నివాసముంటున్న కొరియన్లు ఉదయం బయటకు వెళ్లేందుకు కారులో వచ్చారు. ప్రధాన రహదారిలో ముళ్ల కంపలు అడ్డుగా వేయటంతో... అటు వైపు నుంచి మరో కారును పిలిపించుకుని లగేజ్ మోసుకుని అవతలికి వెళ్లారు. కరోనా వైరస్ భయంతో పండగ పూట ప్రజలెవరూ బయటకు రావడం లేదు.
గ్రామాల్లో కంచెలతో కియా ఉద్యోగులకు చిక్కు
అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు.. బయటివారు ఎవరూ తమ ఊళ్లలోకి రాకుండా సరిహద్దుల్లో కంచెలు వేస్తున్నారు. కియా పరిశ్రమ ఉద్యోగులకు.. ఈ తరహా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా గ్రామాల మధ్య కంచె వేసిన గ్రామస్థులు
TAGGED:
live updates of corona virus