విత్తన అక్రమ నిల్వలు గుర్తింపు... 40 బస్తాలు స్వాధీనం - kalyanadurgam
విత్తనాలు దొరక్క రైతులు పడిగాపు కాస్తుంటే... మరోవైపు అక్రమ మార్గాల్లో అమ్ముకునేందుకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలాంటి వ్యాపారినే అధికారులు పట్టుకున్నారు. 40 బస్తాల వేరుశెనగ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమంగా నిల్వచేసిన వేరుశెనగ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. రాయితీలో రైతులకు పంపిణీ చేయాల్సిన విత్తనాలేనని గుర్తించారు. అక్రమ మార్గంలో రైతుల నుంచి సేకరించి నిల్వ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని... సదరు వ్యాపారి వాదిస్తున్నారు. విత్తనాలతోపాటు అదే ప్రాంతంలో ఖాళీ సంచులు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. విచారణ చేపట్టారు.