అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో దాదాపు 35 మంది వృద్ధులను బతికుండగానే గ్రామ వాలంటీర్లు మరణించినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీనివల్ల వారికి వైఎస్సార్ భరోసా ఫించను అందలేదు. గోరంట్ల మండల కేంద్రంలోని ఒక్క రాజీవ్ కాలనీలోనే 24 మంది వృద్ధులను జీవించి ఉన్నా చనిపోయినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. దీనిపై ఆగ్రహించిన బాధితులు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
35 మంది వృద్ధులను బతికుండగానే చంపేశారు..! - అనంతపురంలో పింఛన్ కష్టాలు
అనంతపురం జిల్లాలో వాలంటీర్ల తప్పిదంతో 35 మంది వృద్ధులకు ఫించను అందలేదు. వారు బతికే ఉన్నా చనిపోయినట్లుగా రికార్డుల్లోకి ఎక్కించారు. దీనిపై స్పందించిన అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
35 Older people did not receive a pension due to the volunteers' mistake