అమరావతి అన్నదాతలకు మద్దతుగా ఇద్దరు మహిళలు తమ బంగారు గాజులు, నల్లపూసలను విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు చేతుల మీదుగా వీటిన అమరావతి ఐకాసకు అందజేశారు. తమకు వాటిని విరాళంగా ఇచ్చే తాహతు లేకపోయినా రైతుల ఆవేదన చూసి చలించిపోయి వాటిని ఇచ్చామని దాతలు తెలిపారు. అమరావతి ఒక్క రాజధాని ప్రాంత రైతుల సమస్య మాత్రమే కాదని.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్యని అన్నారు. తితిదే ఎస్వీబీసీ ఛైర్మన్ రాజధాని ప్రాంత రైతులు, మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అందరూ కలిసి అమరావతిని కాపాడుకోవాలని సూచించారు.
బాబు అభినందన
అమరావతి ఐకాసకు మహిళలు పవిత్రంగా భావించే నల్లపూసలు, బంగారు గాజులు ఇవ్వడంపై తెదేపా అధినేత చంద్రబాబు దాతలను అభినందించారు. వీరిని చూసి అంతా స్ఫూర్తి పొందాలని సూచించారు. అమరావతి ఐకాసలకు ప్రజలే విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: