అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ శేఖర్... తమ సిబ్బందితో కలిసి యాడికి మండలంలో దాడులు నిర్వహించారు. 19 మంది నాటుసారా విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి 300 లీటర్ల నాటుసారా, 11 ద్విచక్ర వాహనాలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో అదునుగా భావించిన నాటుసారా తయారీదారులు ముఠాలుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.
కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం బూరుగుల, సీతమ్మ తాండ గ్రామాలకు.. వీరే నాటు సారా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయమై పూర్తి సమాచారం అందుకున్న తాము ఎక్సైజ్ అధికారులుతో కలిసి విస్తృతంగా తనిఖీలు కొనసాగించామని అధికారులు చెప్పారు. పట్టుబడిన వారిని విచారణ జరపగా వారు.. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వ్యాపారాన్ని చేస్తున్నట్టు చెప్పారన్నారు.