అనంతపురం జిల్లా ఉరవకొండ క్వారంటైన్లో ఉన్న 18 మందిని అధికారులు విడుదల చేశారు. కరోనా వైరస్ లక్షణాలతో గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల క్వారంటైన్ వార్డులో ఉంచిన 18 మందిని ఇళ్లకు పంపారు. వీరికి 14 రోజుల క్వారంటైన్ పూర్తయ్యిందని.. రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అందుకే వారిని ఇళ్లకు పంపిస్తున్నామని చెప్పారు. ఇళ్లకు వెళ్లాక కొన్నిరోజులు జాగ్రత్తలు పాటించాలని తహశీల్దార్ వాణిశ్రీ వారికి సూచించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలన్నారు.
ఉరవకొండ క్వారంటైన్ నుంచి 18 మంది 'డిశ్చార్జ్'! - ఉరవకొండ క్వారంటైన్ నుంచి 18 మంది విడుదల తాజా వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ బాలికల గురుకుల పాఠశాల క్వారంటైన్లో ఉన్న 18 మందిని అధికారులు ఇళ్లకు పంపారు. వారికి 14 రోజుల క్వారంటైన్ పూర్తైందని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని.. అందుకే వారిని స్వస్థలాలకు పంపామని వివరించారు.
ఉరవకొండ క్వారంటైన్ నుంచి 18 మంది ఇళ్లకు..