ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి స్థలం కావాలంటే కోరిక తీర్చాలంటున్న వీఆర్వో... - ఏపీలో ఓ మహిళను వీఆర్వో వేధించాడు

VRO Harassed A Women : అధికారం చేతిలో ఉంది కదా అని తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు కొంతమంది అధికారులు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. దాని పేరుతో సాధారణ ప్రజలను వేధింపులకు గురిచేసిన ఘటనలు కోకొల్లలు. ప్రజా సేవలో భాగంగా సక్రమంగా వారి బాధ్యత నిర్వహించాల్సిన ప్రభుత్వాధికారులు.. ప్రజలకు వారి వల్ల కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అనకాల్లి జిల్లాలో ఓ మహిళ ప్రభుత్వ అధికారి వేధింపులకు గురైంది. వివరాల్లోకి వెళితే..

VRO
వీఆర్వో

By

Published : Jan 31, 2023, 1:08 PM IST

Updated : Jan 31, 2023, 2:30 PM IST

VRO Harassed A Women: అనకాపల్లి జిల్లా పీఎల్​పురం గ్రామానికి చెందిన వీఆర్వో ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు సాంకేతిక కారణాల వల్ల స్థలం మంజూరు కాలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న వీఆర్వో ఆ మహిళ సెల్​ఫోన్​కు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు గురి చేశాడు.

ప్రభుత్వం అందజేస్తున్న ఇంటి స్థలం మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వీఆర్వోకు చెప్పు దెబ్బలు తప్పలేదు. అనకాపల్లి జిల్లా పీఎల్ పురం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు సాంకేతిక కారణాల వల్ల స్థలం మంజూరు కాలేదు.

దీన్ని అవకాశంగా తీసుకుని గ్రామంలో పనిచేస్తున్న వీఆర్వో భాస్కర్ నాయుడు.. ఆ మహిళను తన కోరిక తీర్చాలంటూ, తనతో సహజీవనం చేయాలంటూ సెల్​ఫోన్​కు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. దీంతో అతని వేధింపులు భరించలేక బాధిత మహిళ బంధువులకు తెలియజేయడంతో పంచాయతీకి పిలిపించి వీఆర్వో ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం జరిగిన విషయం పై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

మహిళను వేధింపులకు గురిచేసిన వీఆర్వోకు దేహశుద్ధి

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details