Fake calls: అమరావతి నుంచి మాట్లాడుతున్నామంటూ అధికారుల మాదిరిగా వాలంటీర్లకు ఫోన్ చేసి పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు తీసుకుంటున్న మోసగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేస్తున్నారు. వారి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ఓటీపీ వస్తుంది చెప్పాలంటూ ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు.
Fake Calls: అధికారులమంటూ నకిలీ కాల్స్.. లబ్ధిదారుల ఖాతా నుంచి నగదు కాజేత - అధికారులమంటూ వాలంటీర్లకు నకిలీ కాల్స్
Fake calls: ఆన్లైన్ నుంచి నగదు కాజేసే నేరగాళ్ల పంథా మారింది. ఇప్పటివరకు ఫోన్ నంబర్ తెలిస్తే వారి ఎకౌంట్లు ఖాళీ చేసే ఆగంతుకులు.. ఇప్పుడు వివరాలు తెలుసుకుని మరి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అధికారులమంటూ వాలంటీర్లకు ఫోన్ చేసి.. పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్న ఘటన.. అనకాపల్లి జిల్లాలో జరిగింది.
అధికారులమంటూ వాలంటీర్లకు నకిలీ కాల్స్
అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో చోడవరం-5 వార్డు సచివాలయంలో అమ్మాజీ అనే మహిళ ఖాతా నుంచి రూ.2 వేలు ఇలాగే కొట్టేశారు. అడ్డూరులో ఓ లబ్ధిదారు ఖాతా నుంచి రూ.73 వేలు లాగేశారు. ఇలా ఒకే ఫోన్ నంబరు నుంచి చాలామందికి ఫోన్లు వచ్చాయి. ఈ నకిలీ ఫోన్‌కాల్స్‌పై చోడవరం-5 మహిళా పోలీస్ బగ్గు శివలక్ష్మి వాలంటీర్లను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news