ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్​కి లేదు' - times now

ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన వారికే మా మద్దతు అని జగన్ అంటారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు వైకాపా మద్దతు ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంశం ఎందుకు గుర్తుకు రాలేదు- మీడియా సమావేశంలో లంకా దినకర్

లంకా దినకర్

By

Published : Apr 4, 2019, 1:51 PM IST

లంకా దినకర్ మీడియా సమావేశం
జాతీయ మీడియాలో జగన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. స్వార్థ ప్రయోజనాలు కోసమే జగన్.. మోదీ భజన చేస్తున్నారని అమరావతిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. హద్దుల్లేని అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ నిధులు ఆపాలని జగన్ కేసులు వేశారని ఆరోపించారు. తనపై కేసుల మాఫీకే మోదీకి వంత పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకున్న ప్రధానికి మద్దతుగా ప్రతిపక్ష నేతమట్లాడమేంటని మండిపడ్డారు. జగన్​కి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడే అర్హత లేదని లంకా దినకర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details