ఎన్నికల పోరాటంలో ప్రతి కార్యకర్త ఓ కమాండర్‌గా తయారుకావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. రాష్ట్రమంతటా తెలుగుదేశానికి మంచిఊపుందని, వైకాపాను తమ తీర్పుతోఓ ఆట ఆడుకోవాలని కోరారు. ఇప్పుడు చేసే పోరాటాన్ని... రాష్ట్ర హక్కుల కోసం చేసే ప్రజా పోరాటంగా భావించాలన్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేవన్న వ్యక్తి... న్యాయం చేస్తానంటూ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని జగన్‌పైమండిపడ్డారు. జగన్ ద్వారా ఆంధ్రాను దోచుకునేందుకుతెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికిగట్టి గుణపాఠం చెప్పాలన్నారు.
జగన్ నేరస్తుడనీ.. రాజకీయ నాయకుడులా చలామణి అవుతున్నారని చంద్రబాబు అన్నారు.అరాచకాలను రెచ్చగొట్టే నీఛ ప్రయత్నాలు చేస్తున్నారని.. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. జగన్ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్లో పొందుపరిచినకేసులే నిదర్శనమన్నారు. 48 పేజీల్లో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులుగా అభివర్ణించారు. దేశంలో ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులు ఉండవన్నారు.
చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీఛాతినీఛమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 31 కేసులున్న వారికి ఎవరైనా ఓటేస్తారా..? అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? అని అడిగారు.