ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘాట్ రోడ్​లో మొరాయిస్తున్న హెవీ వెహికల్స్​.. నిత్యం ట్రాఫిక్​ జామ్​

Due to Traffic Problem on Paderu Ghat Road: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్‌పై ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ నుంచి పాడేరుకు రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏసుప్రభు కార్నర్ మలుపు, రాజపురం ఘాట్ రోడ్, వ్యూ పాయింట్, ఎక్కువ ఎత్తు కలిగిన ఘాట్ రోడ్ మలుపుల వద్ద భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి.

Traffic Problem
పాడేరు ఘాట్ రోడ్‌

By

Published : Feb 23, 2023, 5:03 PM IST

Traffic problems on Paderu Ghat road: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్​లో నిత్యం ఏదోచోట ట్రాఫిక్ నిలిచిపోతున్నాయి. వాహనాలు ఆగిపోవడం వల్ల వాహనదారులతో పాటు ప్రయాణికులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో.. గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. నిత్యం విశాఖపట్నం నుంచి పాడేరుకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది. ఎక్కువగా ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ మలుపు, రాజపురం ఘాట్ రోడ్, వ్యూ పాయింట్, ఎక్కువ ఎత్తు కలిగిన ఘాట్ రోడ్ మలుపుల వద్ద భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో నిత్యం ఏదో ఒకచోట ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

భారీ లారీలలో ఇనుము, సిమెంట్​తో వచ్చే ఆయా వాహనాలు లోడుతో ఘాట్ ఎక్కలేకపోతున్నాయి. దీంతో ఇతర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒక్కొక్కసారి కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కుపోతున్నారు. అప్పుడప్పుడు పాడేరు ఏజెన్సీ నుంచి వైజాగ్ వెళ్లే అంబులెన్స్ సైతం ట్రాఫిక్​లో నిలిచిపోవడం వల్ల రోగులు సకాలంలో వైద్యమందక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు.. పాడేరుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉండడం పోలీసులు వచ్చే అవకాశం లేనందున.. ఆయా వాహనాల డ్రైవర్లే ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన తర్వాత, ఈ సమస్య మరింత ఎక్కువయింది. ఓ పక్క జాతీ రహదారి నిర్మాణ సామాగ్రి, మెడికల్ యూనివర్సిటీ నిర్మాణంతో తరచూ భారీ వాహనాలు, లారీలు నిర్మాణ సామాగ్రి తీసుకెళ్తున్నాయి. దీంతో ఘాట్​ మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఘాట్ రోడ్‌పై ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారుల అవస్థలు

'కొత్త జిల్లా అయిన తరువాత ఈ ఘాట్ రోడ్​లో వాహనాల సంఖ్య పెరిగింది. దాని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్ల విస్తరణ చేపట్టాలి. నిత్యం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఓవర్​లోడ్​తో వచ్చే వాహనాల వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి.'- ఆర్టీసీ కండక్టర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details