ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 9:22 AM IST

ETV Bharat / state

గిరి పుత్రుల ప్రాణాలతో జగన్ చెలగాటం - ద్విచక్ర వాహన ఫీడర్‌ అంబులెన్స్‌లపై తీవ్ర నిర్లక్ష్యం

CM Jagan neglect on Two Wheeler Feeder Ambulances: ప్రాణాంతక వ్యాధి ఉన్నా ప్రాణాపాయం సంభవించినా ప్రసవ వేదనైనా డోలీ మోతల నడుమ అల్లాడే ఆదివాసీ బిడ్డలంటే మనసున్న ఎవరైనా కనికరం చూపిస్తారు. చూపించాలి. అలాంటిది సీఎం జగన్‌ తీరే వేరు. ఓట్ల రాజకీయమే ఆయనకు ప్రథమం. నమ్మినోడైనా, వెంట నడిచే వారైనా ఆ తర్వాతే. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందంటే చాలు అది వారికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తప్పించాల్సిందే.

CM_Jagan_neglect_on_Two_Wheeler_Feeder_Ambulances
CM_Jagan_neglect_on_Two_Wheeler_Feeder_Ambulances

గిరి పుత్రుల ప్రాణాలతో జగన్ చెలగాటం- టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ద్విచక్ర వాహన ఫీడర్‌ అంబులెన్స్‌లపై తీవ్ర నిర్లక్ష్యం

CM Jagan neglect on Two Wheeler Feeder Ambulances : గిరిజనులకు ఊపిరి పోసే ద్విచక్ర వాహన ఫీడర్‌ అంబులెన్స్‌లపై జగన్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రెండేళ్లుగా అత్యవసర వైద్య సిబ్బంది ఎంత మొత్తుకుంటున్నా చెవికెక్కించుకోవడం లేదు. గిరిశిఖర గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్యం కోసం టీడీపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ద్విచక్రవాహనాలతో కూడిన ఫీడర్‌ అంబులెన్స్‌ సేవలను 2018లో ప్రారంభించింది. వీటి ద్వారా గర్భిణులు, ప్రాణాంతక వ్యాధుల బారినపడిన రోగులు, ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సేవలు అందేవి. ఈ వాహనంలో పేషెంట్‌ పడుకునే విధంగా బెడ్‌ సౌకర్యం, ఆక్సిజన్‌ సిలిండర్‌, 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. అప్పట్లో గిరిజనులకు సంజీవనిలా ఉపయోగపడిన ఈ వాహనాలపై వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది.
Two Wheeler Feeder Ambulances Started in AP :గతంలో 108కి ఫోన్‌ వెళ్లగానే అక్కడి నుంచే ఫీడర్‌ అంబులెన్స్‌లకు సమాచారం ఇచ్చి మారుమూల గ్రామాలకు పంపేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థకు అప్పగించింది. ఫీడర్‌ అంబులెన్స్‌ల నిర్వహణ GVK సంస్థ చూస్తోంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కొరవడుతోంది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తమకు తెలిసిన ఫీడర్‌ అంబులెన్స్‌ పైలట్లకు ఫోన్‌చేసి చెబితే వారు వచ్చి ఆరోగ్య ఉపకేంద్రం వరకు దించి వెళుతున్నారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు.

108 Vehicle Stopped in Middle of The Road and Person Died: ఆస్పత్రికి వెళ్తుండగా ఆగిపోయిన 108 వాహనం.. గాల్లో కలిసిన నిండు ప్రాణం

TDP Government Started Feeder Bike Ambulance Services : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 122 వాహనాల్లో దాదాపుగా 100 వరకు వాహనాలకు టైర్లు, క్లచ్‌ప్లేట్‌లు అరిగిపోయాయని సమాచారం. కొన్నైతే విరిగిపోయే దుస్థితికి చేరాయి. రోగి పడుకునే బాక్సులు చాలా వాహనాలకు దెబ్బతిన్నాయి. చాలా వాటికి సైరన్‌ మోగడం ఎప్పుడో ఆగిపోయిందని EMT (Emergency Medical Technician)లు చెబుతున్నారు. వాస్తవానికి ఫీడర్‌ అంబులెన్స్‌ల పరిధి 4 కిలోమీటర్లే. ఇప్పుడు 10 నుంచి 20 కిలోమీటర్లూ తిప్పుతున్నారు.

Bike Ambulance For Tribals :EMTలకు నెలకు 13 వేల 500 ఇస్తుండగా ఇప్పుడు వారిపైనే మరమ్మతుల భారం వేస్తోంది ప్రభుత్వం. టైర్‌ పంక్చర్‌ అయినా, మరమ్మతుకు గురైనా ఆ ఖర్చు EMTలే చేతి నుంచి పెట్టుకుంటున్నారు. బిల్లు పెడితే ఆ తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో తిరిగి చెల్లిస్తున్నా పెట్టిన ఖర్చు పూర్తిగా అందడం లేదు. అయినా ఆ చిరుద్యోగులు నెట్టుకొస్తున్నారు. సమస్య పెద్దది అయితే డబ్బు పెట్టుకోలేక అలాగే లాగించేస్తున్నారు. వాహనాల్ని బాగుచేసేందుకు మెకానిక్‌ను నియమించలేదు. దాదాపుగా అన్ని ఫీడర్‌ అంబులెన్స్‌లు మరమ్మతులకు వచ్చాయి. ఒక్కో వాహనంపై 10 నుంచి 15 వేలు ఖర్చు పెడితేనే మామూలుగా నడుస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టడం లేదు.

108 Ambulances: సీఎం వస్తేనే అంబులెన్సులు కదులుతాయంట.. ఆసుపత్రి వద్దనే 146 వాహనాలు

YSRCP Govt Careless on Tribals : ఆరు నెలల క్రితం కేంద్రం ఇచ్చిన 5 కోట్ల రూపాయల నిధులతో కొత్తగా 103 బైక్‌ అంబులెన్స్‌లు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఇప్పటివరకు అతీగతీ లేదు. EMTల నియామకం సందర్భంగా ఏటా వారి వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నిబంధనా ఉంది. ఇప్పటి వరకు వారికి పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే.

108 vehicle on Road: జాతీయ రహదారిపై ఆగిన 108 వాహనం.. పట్టించుకోని అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details