యజువేంద్ర చాహల్ ఆరు స్థానాలు దిగజారి 17వ స్థానానికి పరిమితం కాగా, భువనేశ్వర్ 18వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. లెప్ట్ఆర్మ్ స్పిన్నర్ కృనాల్ పాండ్య 39 స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమంగా 58వ స్థానానికి చేరుకున్నాడు.

బ్యాట్స్మెన్ విభాగంలో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో నిలువగా, కేఎల్ రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు. మరో ఓపెనర్ ధావన్ 11వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
న్యూజిలాండ్తో టీట్వంటీ సిరీస్ ఆడని కెప్టెన్ కోహ్లీ 19వ స్థానాన్ని జింబాబ్వే బ్యాట్స్మెన్ మసకద్జాతో పంచుకున్నాడు. మొదటి స్థానంలో పాక్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్(12వ స్థానం) సంపాదించాడు.
టీం విభాగంలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దాయాది పాకిస్థాన్ కొనసాగుతోంది.