ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

సినీ నటి లావణ్య త్రిపాఠి నివాసంపై జీఎస్టీ దాడులు - lavanya thripati

కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడం వల్ల సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ జీఎస్టీ(డీజీజీఐ) దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని​ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

dggi-rides-on-cinema-actor-lavanya-tripartite-house-in-hyderabad
సినీ నటి లావణ్య త్రిపాఠి నివాసలో జీఎస్టీ సోదాలు

By

Published : Dec 20, 2019, 11:21 PM IST

సినీ నటి లావణ్య త్రిపాఠి నివాసలో జీఎస్టీ సోదాలు

హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా.. లావణ్య తన సినిమా షూటింగ్​ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు

లావణ్య ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు చేస్తోంది. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి:

భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details