ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

200 కోట్ల క్లబ్​లో 'ఉరీ' - ఉరి

సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'ఉరీ' రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. నాలుగు వారాల కలెక్షన్లలో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

200 కోట్ల క్లబ్​లో 'ఉరీ'

By

Published : Feb 9, 2019, 6:19 AM IST

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉరీ' చిత్రం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తక్కువ బడ్జెట్​తో తెరకెక్కి రూ. 200 కోట్లు రాబట్టిన మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. నాలుగు వారాల కలెక్షన్లలో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 23, 24వ రోజు వసూళ్లలో బాహుబలిని దాటి సత్తాచాటింది.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 16న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​లోని సైనిక స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల ఆధారంగా సినిమా రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details