ఇప్పుడంతా సోషల్ మీడియా.. ఫొటోగ్రాఫర్లదే హవా. సరైన ఫొటో ఒక్కటి పడితే చాలు. లైకులే.. లైకులు.. కామెంట్లు. ఫోన్ కెమెరా చాలు.. ఎంత అందాన్నైనా బంధించేందుకు. డీఎస్ఎల్ఆర్ అవసరం లేదు. ఫొటో షూట్ కెళ్లినా.. ఏదైనా టూర్‌కెళ్లినా.. కొన్ని నియమాలు పాటిస్తే చాలు. మీరూ అయిపోవచ్చు..స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఫొటో గ్రాఫర్..!
లెన్స్‌పై ఓ కన్నేయండి..
మీ కళ్లకు దుమ్ము పడితే.. ఏదైనా చూడగలరా..? అబ్బే కష్టం. మరీ కెమెరా కళ్లనెందుకు పదేపదే టచ్ చేసి పాడుచేస్తారు. లెన్స్ మురికిగా ఉంటే.. ఫొటోలు సరిగా రావు. అలా అని చేత్తో తూడ్చడం ఆపేయండి. వేలిముద్రలు పడి.. ఫొటోలు సరైన కాంతితో రావు. మెత్తటి వస్త్రం, శుభ్రపరిచే స్ర్పేను మీతో ఉంచుకోండి.
కాస్త వెలుతురును చూడండి..
ఫొటోగ్రఫీకి ముఖ్యమైనది లైటింగ్. ఏ సమయంలో ఎటునుంచి ఫొటో తీయాలో ఓ అవగాహన ఉండాలి. సూర్యుడికి ఎదురుగా ఫొటో తీశారనుకో.. సబ్జెక్ట్ సరిగా ఫోకస్ కాదు. కాంతిని సరిగా వాడుకుంటే.. ఫొటోకు మంచి మంచి ఎఫెక్ట్స్ వస్తాయి. పగడి పూట సూర్యుడి కాంతిని సరిగా వాడుకుంటే మీరు.. మంచి ఫొటో తీయోచ్చు. రాత్రి వేళల్లో మాన్యువల్ సెట్టింగ్స్‌ను సరిచేసుకుని ప్రయోగాలు చేయొచ్చు. స్ట్రీట్ ఫొటోగ్రఫీకి వెనక ఎప్పుడూ ఓ నేపథ్యం, కథాంశం ఉండాలి. ఫ్రేమింగ్‌పై కసరత్తు చేస్తే ఫాలోవర్స్ ఎప్పుడూ మీ వెంటే.
ఫోకస్.. చాలా ముఖ్యం బాస్
అసలు మీరు దేన్ని ఫొటో తీయాలనుకుంటున్నారో... దానిపై స్పష్టత ఉండాలి. సబ్జెక్ట్‌ను వస్తుందిలే..అని స్మార్ట్ ఫోన్‌ను కాస్త పక్కకు జరిపినా.. మీ ఫొటోగ్రఫీకి మైనస్ మార్కులు పడతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో మంచి ఫోకస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఫీల్డ్ డెప్త్ బ్యాక్ గ్రౌండ్ బ్లర్, మోషన్ క్యాప్చర్ వంటి ఎన్నో కొత్తం అంశాలు మీ ఫోన్లో ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి.
జూమ్ చేస్తున్నారా.?