రాజ్‌గిర్ బార్
కావాల్సినవి: బెల్లం-కప్పు, నీళ్లు-రెండు చెంచాలు, నెయ్యి-అరచెంచా, రాజ్గిరా పేలాలు-కప్పు, యాలకుల పొడి-అరచెంచా.
తయారీ:ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తీసుకుని పొయ్యిమీద పెట్టి కరిగించుకోవాలి. అందులో నెయ్యి కూడా వేసుకుని పాకం వచ్చేంతవరకూ ఉంచి.. స్టౌ కట్టేయాలి. దీనిలో కొబ్బరి పొడి, వేయించిన పల్లీలు, రాజ్గిరా పేలాలు, యాలకుల పొడి వేసుకుని అన్నీ ఒకదానితో ఒకటి కలిసెటట్టు బాగా కలుపుకోవాలి. వెడల్పాటి పాత్రకు నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా.. సర్దుకోవాలి. ఈ పాత్రను ఫ్రిజ్‌లో ఉంచి గంట తర్వాత నిలువుగా ముక్కలు కింద కోసుకోవాలి. ఇవి నెలరోజుల వరకూ నిల్వ ఉంటాయి.
ఓట్స్ బార్
కావాల్సినవి: ఓట్స్-నాలుగు చెంచాలు, బటర లేదా పీనట్ బటర్-చెంచా, తేనే-అరచేంచా
తయారీ:ముందుగా అవెన్‌లో కానీ మందపాటి పాత్రలో కానీ బటర్‌ను కరిగించుకోవాలి. అందులో తేనె, ఓట్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎనర్జీ బార్స్ చేసుకునే మూసలు మార్కెట్లో దొరుకుతాయి. అందులో వేసి సమంగా సర్దుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచి తెల్లారి తీస్తే చక్కగా వస్తాయి.