ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

బీట్‌రూట్‌ తింటే ఆరోగ్యం.. ఇలా చేస్తే అందం!

బీట్‌రూట్‌ అనగానే.. మొహం అదోలా పెడతారు చాలామంది. కానీ దీన్ని తింటే ఆరోగ్యం, సౌందర్య పోషణకు వినియోగిస్తే అందం. దీన్ని జుట్టు, చర్మానికి ఎలా వాడాలో తెలుసుకుందాం...

బీట్‌రూట్‌ తింటే ఆరోగ్యం.. ఇలా చేస్తే అందం!
బీట్‌రూట్‌ తింటే ఆరోగ్యం.. ఇలా చేస్తే అందం!

By

Published : Sep 1, 2020, 11:28 PM IST

  • బీట్‌రూట్‌లో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్‌, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజాలు, ప్రొటీన్‌ లాంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టేబుల్‌ స్పూన్‌ నానబెట్టిన బియ్యంలో రెండు బీట్‌రూట్‌ ముక్కల్ని కలిపి మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాసిని పాలు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుని మృదువుగా రుద్దాలి. ఐదారు నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే...మృతకణాలు తొలగి చర్మం సహజంగా మెరుస్తుంది.
  • బీట్‌రూట్‌లోని సిలికాన్‌ ఖనిజం చర్మం తాజాగా కనిపించేలా చేస్తుంది. గోళ్లు, జుట్టు పెరగడంలో కీలకంగా పని చేస్తుంది. ఈ దుంపను ఉడకబెట్టి గుజ్జుగా చేయాలి. దీనికి చెంచా బాదం నూనె, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఇది నిర్జీవంగా ఉన్న చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.
  • రసాయనాలు కలిపిన రంగులు జుట్టుకి వేయడం వల్ల అందం సంగతి పక్కనుంచితే జరిగే హానే ఎక్కువ. బీట్‌రూట్‌ జ్యూస్‌ని తలపై నచ్చిన చోట రాసుకుని రెండు గంటలపాటు ఆరనిస్తే... సహజ హెయిర్‌ డైలా కనిపిస్తుంది. అలానే హెన్నా కలిపేటప్పుడు గోరింటాకు మిశ్రమానికి బీట్‌రూట్‌ రసాన్ని కూడా కలిపితే చక్కని రంగు వస్తుంది.
  • కొందరి పెదాలు కాంతిహీనంగా కనిపిస్తాయి. వీరు బీట్‌రూట్ రసంలో చెంచా పంచదాక కలిపి ఆ మిశ్రమంతో పెదాలపై నెమ్మదిగా రుద్దాలి. పెదాలు నలుపుదనం పోయి చక్కగా కనిపిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details