ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

ఫిట్​నెస్​ గురూ.

తక్కువ సమయంలో కాలినడకన శ్రీవారిని చేరుకున్న రాహుల్ గాంధీ.. ఫిట్​నెస్ విషయంలో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

By

Published : Feb 23, 2019, 12:37 AM IST

తిరుమల కాలినడక దారిలో రాహుల్

నేటితరం యువకులు ఫిట్​గా ఉండాలని జిమ్​కు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ... టక్కున గుర్తొచ్చేదికాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహల్ గాంధీనే. శారీరక దృఢత్వంలోయువకులకు ఏమాత్రంతీసిపోనని మరోసారి నిరూపించుకున్నారు రాహుల్.కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన గాంధీ.. కేవలం 110 నిమిషాల్లో సప్తగిరులను అధిరోహించి అబ్బురపరిచారు. మేనల్లుడు రైహాన్ వాద్రాతో కలసి చిరునవ్వులు చిందిస్తూ అలసట లేకుండా ప్రయాణం పూర్తి చేశారు.

కాలినడకన ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ

ఇంతకు ముందు తెదేపా జాతీయాధ్యక్షులు చంద్రబాబునాయుడు 120 నిమిషాల్లో కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి 210 నిమిషాలు , జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 210 నిమిషాల్లో కాలినడకన తిరుమల చేరుకున్నారు.

గతంలో కూడా రాహుల్ గాంధీ తను ఫిట్​నెస్ విషయంలో ముందుంటారని తెలియజెప్పారు. 34 కిలోమీటర్ల మౌంట్ కైలాస్ యాత్రను 463 నిమిషాల్లో పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్ కాడోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. పవర్ యోగా సాధన సహా రోజు విడిచి రోజు 12 కిలోమీటర్ల పరిగెత్తటం...48 సంవత్సరాల వయస్సులోనూ రాహుల్ ఫిట్​గా ఉండేలా చేస్తునాయి.

ABOUT THE AUTHOR

...view details