శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న విషయం విదితమే. వ్యాయామ సమయంలో విడుదలయ్యే హార్మోన్లతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అల్జీమర్స్ రాకుండా ఉండేందుకు వ్యాయామం ఉపయోగపడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
వ్యాయామం ద్వారా 'ఇరిసిన్' అనే హార్మోన్ విడుదలవుతుందని.. ఇది శరీరంలో శక్తిని పెంపొందిస్తుందని ప్రైమరీ అధ్యయనాల్లో తేలింది. నేచర్ మెడిసిన్ జర్నల్లోని తాజా పరిశోధన ప్రకారం మెదడులోని నాడీ కణాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిసింది.
వ్యాయామం శారీరక దృఢత్వాన్ని పెంపొదిస్తూ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగపడుతుందని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒట్టావియో తెలిపారు.
మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగంలో ఇరిసిని హార్మోన్ ఉందని.. అల్జీమర్స్ ఉన్నవారిలో ఈ హోర్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది.
"జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు వ్యాయామం చేయడం మంచిది. శారీరక పెరుగుదలతో పాటు మెదడుకి ఇది ఎంతో ఉపయోగకరం. అందిరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. హృద్రోగులు, ఆర్థరైటిస్, డైమన్షియా వ్యాధులతో బాధపడేవారు ఇరిసిన్ ఉత్పత్తి చేసే మెడిసిన్ వాడటం మంచిది."
-ఒట్టావియో అరన్సియో, అధ్యాపకుడు, కొలంబియా విశ్వవిద్యాలయం