ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

మీ వంటల్లో ఎంత నూనె వేస్తున్నారో తెలుసా?

మనం రోజు తినే వంటల్లో ఎంత నూనె వేస్తున్నామో తెలుసా... నూనె ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న అవగాహన మీకు ఉందా? ఇలాంటి విషయాలు మనకు తెలియజేసేందుకు ఓ కొత్త పరికరం వచ్చేసింది. అదేంటో మీరూ తెలుసుకోండి.

got-a-device-to-know-how-much-oil-is-in-your-dishes
వంట నూనె కూరల్లో వేసేందుకు లెక్క వచ్చేసింది

By

Published : Jun 4, 2020, 7:02 PM IST

కూరలు, వేపుళ్లలో ఎంత నూనె వేస్తున్నారో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కూరగాయలు సరిగ్గా వేగలేదనుకుంటే మరికాస్త నూనె పోస్తారు. దానికి ఒక లెక్కంటూ ఉండదు. అలా కాకుండా కూర కోసం ఎంత నూనె వాడుతున్నామో కచ్చితంగా తెలియాలంటే ఇలాంటి నూనె సీసాలు మన దగ్గర ఉండాల్సిందే.

ఇవి ఉంటే ఎంత నూనె వాడామన్నదీ.. వంట చేసే వారికి కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఆ వాడకాన్ని కాస్త తగ్గించుకునే వీలును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ సీసాలు ఆకర్షణీయమైన రంగుల్లో చూడచక్కగానూ ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details