అసలేం జరిగిందంటే...
దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ మండలం సింగోటంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లినే పొట్టనబెట్టుకున్నాడో కర్కశ కుమారుడు. తన ప్రాణం పోసి.. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే... కాలయముడవుతాడని తెలుసుకోలేకపోయింది.
దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు
రాముడు అనే వ్యక్తి... మద్యం మత్తులో తన తల్లి చంద్రమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను, మొండెంను వేరుచేశాడు. అనంతరం తల్లి తలను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.