విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణ శివారు సీతంపేట సమీపంలో... మాలిన వాణి చెరువు మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. శ్రీనివాస కాలనీకి చెందిన బత్తిన జనార్ధన్.. బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఇతను పుట్టింట్లో ఉన్న భార్య వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొని చనిపోయాడు. ఇతనికి 8 నెలల క్రితం వివాహమైంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రమాదాలు.. ఇద్దరు మృతి - road accident in vizianagaram district
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. ఇద్దరు చనిపోయారు.
road accidents in visakhapatnam, viziangaram districts.. 2 died
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦ నామవారం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. యస్ రాయవరం మండలం గెడ్డ పాలెం గ్రామానికి చెందిన వి. బాబ్జీ.. గుంటపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబ్జీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.