ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

నంద్యాలవాసి.. పొద్దుటూరులో అనుమానాస్పద మృతి - kurnoon district

రోడ్డుపై మద్యం తాగుతూ అర్థరాత్రి పోలీసులకు చిక్కాడు. ఓ పెళ్లికి వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.

నంద్యాలవాసి.. పొద్దుటూరులో అనుమానాస్పద మృతి

By

Published : May 14, 2019, 11:08 AM IST

నంద్యాలవాసి.. పొద్దుటూరులో అనుమానాస్పద మృతి

కడపజిల్లా పొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అతడిని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పటాన్ గౌస్ ఖాన్​గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత రాత్రి ఇ ప్రొద్దుటూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో కారులో లో డోర్ తెరిచి మద్యం మత్తులో గౌస్ ఖాన్ నిద్రిస్తున్నాడు. గమనించిన బ్లూ కోల్డ్ పోలీసులు.. ఎలాంటి రికార్డులు లేవని గుర్తించారు. పోలీసులు అతడిని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. స్థానికంగా ఓ పెళ్లికి వచ్చాను అతను చెప్పిన గౌస్ ఖాన్​ను.. పెళ్లికి సంబంధించినవారిని తీసుకురావాల్సిందిగా చెప్పి పంపించేశారు. తెల్లారేసరికి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ దుకాణం ముందు గౌస్ ఖాన్.. పోలీస్ స్టేషన్ ఎదుట ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details