తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలోని ఆలయంలో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో పురుగుల మందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజానగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మనస్తాపంతో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం
కొంతమంది దుష్ప్రచారం చేయటంతో మనస్తాపం చెందిన వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
అక్రమ సంబంధం అంటగట్టారని ఆత్మహత్యకు పాల్పడ్డారు
వీరిద్దరూ కలిసి భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పలువురు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేయటంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులంటున్నారు.
ఇవీ చదవండి...భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?
TAGGED:
To commit suicide