భార్య తనపై కేసు పెట్టినందుకు మనస్తాపానికి గురైన భర్త... పోలీసు స్టేషన్ వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వట్టిచెరుకూరుకు చెందిన ఇన్నారావు, జ్యోతి ఆలేఖ్య భార్యభర్తలు. కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవల భార్య జ్యోతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చింది.
ఇద్దరి మధ్య కలహాలు తీవ్రమై... భర్తపై భార్య జ్యోతి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో మనస్తాపానికి భర్త ఇన్నారావు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పొన్నూరు ఆస్పత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.