ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భూ వివాదం.. రెండో భార్యపై భర్త దాడి - భార్యపై కత్తితో దాడి

తెలంగాణలోని ఖమ్మంలో దారుణం జరిగింది. భూ వివాదంలో భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఆగ్రహానికి గురైన భర్త.. కొబ్బరిబోండాల కత్తితో భార్యపై దాడి చేశాడు.

తెలంగాణలో దారుణం... రెండో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి
తెలంగాణలో దారుణం... రెండో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి

By

Published : Feb 19, 2020, 10:35 AM IST

తెలంగాణలో దారుణం... రెండో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి

తెలంగాణ ఖమ్మం జిల్లా రమణగుట్టలో భార్యపై కొబ్బరిబోండాల కత్తితో భర్త దాడి చేశాడు. భూ వివాదమే ఇందుకు కారణమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారావు అనే వ్యక్తి రెండు వివాహాలు చేసుకున్నాడు. అతని రెండో భార్య పేరు జ్యోతి. ఆమె పేరుతో ఉన్న ఇల్లు, ఇంటి స్థలాన్ని అల్లుడికి చూపిస్తుండగా.. రామారావు అడ్డుకున్నాడు. అవి తన మొదటి భార్యకు చెందినవని, తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో పట్టరాని ఆగ్రహంతో.. కొబ్బరిబోండాల కత్తి తీసుకుని జ్యోతిపై దాడి చేశాడు.

స్థానికులు రామారావుకు దేహశుద్ధి చేశారు. ఖమ్మం రెండో పట్టణ ఠాణాలో అప్పగించారు. జ్యోతిని సమీప ఆసుపత్రికి తరలించారు. రామారావు వేధింపులు తట్టుకోలేకే ఆయన మొదటి భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందని.. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు జ్యోతి చెప్పింది. తమ ఆస్తిని అక్రమంగా విక్రయించేందుకు తండ్రి రామారావు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నందుకే... తన తల్లిపై దాడి జరిగిందని బాధితురాలి కూతురు దివ్య ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details