కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగలాపురం గ్రామంలోని నీటి ట్యాంక్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రామ్మోహన్రెడ్డి వెల్లడించారు.
'ప్రజలు సహకరించాలి : పోలీసులు'
నిందితుల వద్ద నుంచి రూ.8200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలుపై తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
ఇవీ చూడండి:
250 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత