ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. మానసిక వేదనతో ఓ వ్యక్తి వెంటవెంటనే రెండుసార్లు ప్రయత్నించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మొదటి ప్రయత్నంలో ప్రాణం దక్కినా.. వెంటనే మరోసారి ప్రయత్నించి అసువులు బాశాడు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా వర్గల్​ మండల కేంద్రంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.

carpenter suicide
ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ బలవన్మరణం

By

Published : Dec 12, 2020, 11:54 AM IST

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా వర్గల్​ మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఎం.రామచంద్రం అనే కార్పెంటర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్రం, సువర్ణ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. ఇద్దరు కుమార్తెలు ఇంజినీరింగ్​ చదువుతున్నారు. కార్పెంటర్‌ పని బాగా చేయగలడనే పేరున్న అతనికి లాక్‌డౌన్‌ కాలం శాపంగా మారింది. గిరాకీలు లేక గజ్వేల్‌లో ఉన్న దుకాణాన్ని మూసేశాడు.

అంతలోనే ఆయనకున్న అరెకరం భూమిలో కొంత భాగాన్ని కాళేశ్వరం కాలువల నిర్మాణం కోసం సేకరిస్తున్నట్టు ఇటీవలే భూసేకరణ ప్రకటన వెలువడింది. ఈ పరిణామాలన్నీ ఆయన్ను మానసికంగా కుంగదీశాయి. వృత్తిపని నడవని పరిస్థితుల్లో పిల్లల చదువులు కొనసాగించడం ఎలా? వారికి పెళ్లిళ్లు చేయడమెలా! అనే ఆలోచనలు... బతుకుపై ఆయనకున్న ఆశలను క్రమంగా చంపేస్తూ వచ్చాయి. ఇదే అభిప్రాయాన్ని 15 రోజులుగా భార్య, తమ్ముడి వద్ద వ్యక్తం చేస్తుండటంతో వారు ఆయనకు తోడుగా ఉంటూ కనిపెట్టుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం రహస్యంగా పొలం వద్దకెళ్లిన ఆయన.. ముందుగా అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో గాయపడి దూరంగా ఎగిరిపడ్డాడు. అయినా ప్రాణం పోకపోవటంతో వెంటనే ఉరేసుకున్నాడు. అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి... ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి..

ABOUT THE AUTHOR

...view details