తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న శివమణి అనే రెండేళ్ల బాలున్ని నాగుపాటు కాటేసింది. చిన్నారి తల్లిదండ్రులు గుర్తించి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అందిస్తున్న క్రమంలో బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకు అల్లామురుద్దుగా ఆడుకుంటున్న తన కుమారుడు విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.