భర్త పండగకు రానన్నాడని మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణాని(SUICIDE)కి పాల్పడింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా ఆమనగల్లు మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అనిల్ డీసీఎం డ్రైవర్. దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్ చేసింది. పని ఉందని రావడానికి వీలు కాదని చెప్పడంతో మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది.
SUICIDE: తెలంగాణలో దారుణం.. భర్త పండగకు రానన్నాడని.. - భార్య బలవన్మరణం
పండగ పూట సరదాగా గడపాల్సిన ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ ఇంట శాశ్వత దుఃఖాన్ని మిగిల్చింది.. భర్త పండగకు రానన్నాడని ఊహించని దారుణానికి ఒడిగట్టిన భార్య.. బంధుమిత్రులను శోక సంద్రంలో ముంచేసింది.
SUICIDE
క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య (SUICIDE)కు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే.. మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మేశ్ తెలిపారు. పండుగ పూట జరిగిన ఈ విషాదంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
ఇదీ చదవండి:CHEATING: బాలికను మోసగించిన యువకుడు... పోక్సో చట్టం కింద కేసు నమోదు