ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి - Two Young Mans Died in penna river

Two Young Mans Died : వైఎస్సార్​ కడప జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవు రావటమే వారి మృత్యువుకు కారణమైంది. సెలవు కావటంతో ఇద్దరు మిత్రులు సంతోషంగా గడుపుదామనుకున్న వారు అనంతలోకాలకు చేరుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Two Young Mans Died
ఇద్దరు యువకులు మృతి

By

Published : Feb 13, 2023, 8:45 AM IST

పెన్నానదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి

Two Young Mans Died In Penna River : పెన్నానదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కావటంతో పెన్నా తీరానికి వెళ్లి సంతోషంగా గడుపుదామనుకుని నిశ్చయించుకున్న.. ఆ ఇద్దరు యువకులకు ఆ ఆలోచనే వారి ప్రాణాలను బలి తీసుకుంది. నది తీరంలో హుషారుగా గడిపి సాయంత్రం ఇంటికి వెళ్దమనుకున్న వారు.. విగతా జీవులుగా ఇల్లు చేరారు. చేతికి అందిన కుమారులను విగత జీవులుగా చూసిన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్​ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్​ రెడ్డి, జయకుమార్​ రెడ్డి ఇద్దరు మిత్రులు. ఆదివారం సెలవు దినం కావటంతో సరదగా గడుపుదామని.. వారు పెన్నా నది తీరానికి వెళ్లారు. నది తీరంలో గడిపిన వారికి చేపలు పట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో నదిలోకి దిగి చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నదిలో గల్లంతయ్యారు.

నది దగ్గరికి వెళ్లిన వారు రాకపోయే సరికి స్థానికులు నది తీరంలో గాలించారు. ఆచూకి లభించకపోయే సరికి నదిలో దిగి గాలించారు. నదిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికందిన కుమారుల మరణవార్త విన్న తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details