ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం - ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి తాజా వార్తలు

ఓ మహిళ విషయంలో తలెత్తిన వివాదంలో యువకుడిపై మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం హరిజనవాడలో జరిగింది. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

attack with knife
యువకుడిపై కత్తితో దాడి

By

Published : Mar 22, 2021, 7:04 PM IST

పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం హరిజనవాడలో పవన్ కుమార్ అనే యువకుడిపై మరో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేశారు. పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడిచేసిన శ్రీనివాస్, లచ్చి అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఓ మహిళ విషయంలో వచ్చిన వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి వివరాలు తేల్చేలా దర్యాప్తు కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details