Two men died in road accident: పండగపూట అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెంలో విషాదం నెలకొంది. కొత్తగా పెళ్లైన ఓ వ్యక్తి.. తన భార్యను చూడటానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతనితో పాటు ఓ స్నేహితుడు మృతి చెందారు. ఉగ్గినపాలెం జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కసింకోట హౌసింగ్ కాలనీ చెందిన బొర్రా నాగు, సింగంపల్లి వివేక్ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలిస్తుండగా వివేక్ మృతి చెందాడు. నాగుని విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో దీపావళి పండుగ రోజు మృతుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కసింకోట ఎస్ఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
పండగకు వెళ్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి - అనకాపల్లి తాజా వార్తలు
Two men died in road accident: కొత్తగా పెళ్లైన వ్యక్తి తన భార్యని చూడటానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది జరిగిన ప్రమాదంలో అతను అతని స్నేహితుడు ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గిన పాలెంజాతీయ రహదారి వద్ద జరిగింది. కసింకోట హౌసింగ్ కాలనీ చెందిన బొర్రా నాగు,సింగంపల్లి వివేక్ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివేక్ ఆసుపత్రికి తరలిస్తుండగా చెందగా. నాగు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
road accident